
అమరావతి, 4 డిసెంబర్ (హి.స.)
గుత్తి, : గుత్తిలో నకిలీ ఇళ్ల పట్టాల దందా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు నాయకులకు అనుచరులుగా ఉంటూ అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ సృష్టిస్తూ... ఒక్కో పట్టాకు రూ.10వేల నుంచి 15 వేలు దండుకుంటున్నారు. ఇక్కడ పనిచేసి మరోప్రాంతానికి బదిలీ అయిన అధికారులతోపాటు మృతుల సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారు. దీంతో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈనేపథ్యంలో నిజమైన పట్టాలు ఉన్నవారితోపాటు నకిలీవి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. గుత్తిలోనే సుమారు వెయ్యి నకిలీ పట్టాలు ఉన్నట్లు అంచనా. పట్టణానికి చెందిన నలుగురు నకిలీ పట్టాల దందాను నడిపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ