
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
దేశవ్యాప్తంగా 1,232 ఇండిగో
ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు రద్దు అయిన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సౌదీ అరేబియా నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఇండిగో విమానం (ఫ్లైట్ నంబర్ 6E 058)కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
కాగా, ఆ ఫ్లైట్లో మొత్తం 180 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో అహ్మదాబాద్లో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ విమానాన్ని ఎయిర్పోర్టు సిబ్బంది ప్రత్యేక బేలో ఉంచి, బాంబు స్క్వాడ్, గుజరాత్ ఏటీఎస్, సీఐఎస్ఎఫ్ బృందాలు పూర్తిగా తనిఖీలు చేశాయి. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకలేదని వారు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు