ఏపీలోని సత్యసాయి జిల్లా లో.ఇంటర్ చదువుతున్న .ఓ.విద్యార్దిని ఆత్మహత్యాయత్నం ఆసుపత్రిలో మృతి
అమరావతి, 4 డిసెంబర్ (హి.స.) : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో కన్నుమూసిన ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది. పోలీసుల నిర్లక్ష్యమే తన కుమార్తెను బలి తీసుకుందని తల్లిదండ్రులు ఆర
ఏపీలోని సత్యసాయి జిల్లా లో.ఇంటర్ చదువుతున్న .ఓ.విద్యార్దిని ఆత్మహత్యాయత్నం ఆసుపత్రిలో మృతి


అమరావతి, 4 డిసెంబర్ (హి.స.)

: ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో కన్నుమూసిన ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది. పోలీసుల నిర్లక్ష్యమే తన కుమార్తెను బలి తీసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు

పులేటిపల్లి గ్రామానికి చెందిన అమల, ఆంజనేయులు దంపతుల కుమార్తె స్పందన ధర్మవరంలో ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. చెన్నెకొత్తపల్లి మండలం ముష్టికోవేల గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ధర్మవరంలోని మరో కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే, బస్సులో కాలేజీకి వెళ్లివచ్చే క్రమంలో తరుచూ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. వైఖరి మార్చుకోవాలని విద్యార్థిని ఆమె తీవ్రంగా హెచ్చరించింది. దీంతో ఆ విద్యార్థి నానా దుర్భాషలాడుతూ విచక్షణార హితంగా బస్సులోనే విద్యార్థిని పై దాడి చేశాడు. ధర్మవరంలో బస్సు దిగి కాలేజీకి వెళ్తున్న సందర్భంలోనూ మరోసారి విద్యార్థిని పై దాడి చేశాడు. దీంతో బాధిత విద్యార్థిని అతడిపై ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఘటన చెన్నేకొత్తపల్లి పరిధిలో జరిగిందని, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. దీంతో, బాధిత విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలిసి చెన్నెకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande