
అనంతపురం, 4 డిసెంబర్ (హి.స.)
కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్ ఎక్స్‌ప్రెస్)ను ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లోనూ నిలపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలును జనవరి 2వ తేదీ నుంచి ఎస్‌ఎ్‌సపీఎన్ స్టేషన్‌లో రెండు నిమిషాలసేపు స్టాపింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఈ రైలు వేళలను కూడా సవరించినట్లు తెలిపారు. కలబురగి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (నం. 22231) ఉదయం 5-15 గంటలకు కలబురగిలో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు చేరేది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ