మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయం : ఖమ్మం కలెక్టర్
ఖమ్మం, 4 డిసెంబర్ (హి.స.) మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించిన కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా అటవీ అధికారి సిద్ద
ఖమ్మం కలెక్టర్


ఖమ్మం, 4 డిసెంబర్ (హి.స.) మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించిన కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు. కొణిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక, రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల, విద్య, వైద్య శాఖ మంత్రిగా సేవలు అందించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొంత కాలం సేవలు అందించారని, అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా పనిచేశారని తెలిపారు. మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయమని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande