
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
హిల్ట్ పాలసీ మీద బీఆర్ఎస్ చేస్తున్న
విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. నిరుద్యోగుల పొట్ట కొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఢిల్లీ మొత్తం కాలుష్యంతో నిండిపోయందని హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రాకూడదు అనే సీఎం రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకువచ్చారని అన్నారు. ఇది ఒక గొప్ప పాలసీ అని మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఈ పాలసీ వల్ల ప్రజలకు అందుబాటులోకి భూముల ధరలు వస్తాయని చెప్పారు. పరిశ్రమలు హైదరాబాద్ నడిఒడ్డున ఉండటం వల్ల కాలుష్యం పెరిగిపోతుందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..