
మహబూబాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లాను డ్రగ్స్ రహిత
జిల్లాగా చేయడంలో అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ తో కలిసి నేషనల్ నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం చేస్తే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కళాశాలల్లో పోలీసు శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు