పంచాయతీ ఎన్నికలు.. మంత్రి సీతక్క స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
ములుగు, 4 డిసెంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వగ్రామంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ములుగు మండల పరిధిలోని జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్
మంత్రి సీతక్క


ములుగు, 4 డిసెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వగ్రామంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ములుగు మండల పరిధిలోని జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. సర్పంచ్ పదవికి కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ఏకాభిప్రాయం అవసరమని మంత్రి సీతక్క సూచనల మేరకు స్థానిక నాయకులు పోటీదారులతో ఆమె సమాలోచనలు జరిపారు. ఫలితంగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న అర్రెం వెంకన్న పేరును ఏకగ్రీవ సర్పంచ్ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande