ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, 4 డిసెంబర్ (హి.స.) కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని అన్నారు. ఇప్పటికే పది చోట్ల ప్రవేశపెట్టిన కొత్త టోల్ వ్యవస్థను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని లోక్ సభలో
నితిన్ గడ్కరీ కీలక


న్యూఢిల్లీ, 4 డిసెంబర్ (హి.స.)

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక

ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని అన్నారు. ఇప్పటికే పది చోట్ల ప్రవేశపెట్టిన కొత్త టోల్ వ్యవస్థను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని లోక్ సభలో ప్రకటించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ ప్రోగ్రామ్ ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులకు ఒకే వేదికగా పనిచేస్తుందన్నారు.

ప్రస్తుతం రూ.10లక్షల కోట్ల రూపాయల విలువైన 4,500 హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నట్టు నితిన్ గడ్కరీ వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande