
నిజామాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు కలిగిన అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటి విడతలో ఈ మండలానికి ఈ నెల 11న పోలింగ్ ప్రక్రియ జరుగనుండగా, నామినేషన్ల స్వీకరణ నుండి మొదలుకుని ఇప్పటివరకు పూర్తి చేసిన ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా, పోలింగ్ నిర్వహణ కోసం చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ ఎం.పీ.డీ.ఓ, తహసిల్దార్ ఇతర అధికారులతో సమీక్ష జరిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు