సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తికి మద్దతు ధర.. పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి, 4 డిసెంబర్ (హి.స.) సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తికి మద్దతు ధర లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లిలో గల మహాలక్ష్మి జిన్నింగ్ మిల
పెద్దపల్లి ఎమ్మెల్యే


పెద్దపల్లి, 4 డిసెంబర్ (హి.స.)

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తికి మద్దతు ధర లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లిలో గల మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో గురువారం సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిన్నింగ్ మిల్ యాజమాన్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతు కలవేన మల్లేశంకు చెందిన 27.80 క్వింటాళ్ల పత్తిని మొదట కోనుగోలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన ఏ-గ్రేడ్ పత్తికి క్వింటాలుకు రూ.8100 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు. 8 నుండి 12 శాతం లోపు తేమ ఉండేలా పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులను కోరారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande