సి సత్యసాయి జిల్లా చెందిన రామచంద్ర దక్షిణాఫ్రికాలో అదృశ్యం
శ్రీ సత్యసాయి జిల్లా 4 డిసెంబర్ (హి.స.)తలుపుల: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం కొవ్వూరు వాండ్లపల్లికి చెందిన రామచంద్ర దక్షిణాఫ్రికాలో అదృశ్యమయ్యాడు. ఏడాది క్రితం బోర్‌వెల్స్‌లో పని చేసేందుకు అక్కడికి వెళ్లిన రామచంద్ర.. చివరిసారిగా నవంబర్‌ 22న కుట
సి సత్యసాయి జిల్లా చెందిన రామచంద్ర దక్షిణాఫ్రికాలో అదృశ్యం


శ్రీ సత్యసాయి జిల్లా 4 డిసెంబర్ (హి.స.)తలుపుల: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం కొవ్వూరు వాండ్లపల్లికి చెందిన రామచంద్ర దక్షిణాఫ్రికాలో అదృశ్యమయ్యాడు. ఏడాది క్రితం బోర్‌వెల్స్‌లో పని చేసేందుకు అక్కడికి వెళ్లిన రామచంద్ర.. చివరిసారిగా నవంబర్‌ 22న కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఆ తర్వాత అందుబాటులోకి రాలేదు. కొందరు దుండగులు అతడిని అపహరించినట్లు అక్కడి సంస్థ యాజమాన్యం నవంబర్‌ 23న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డ ఆచూకీ తెలపాలని తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ స్పందించి.. తమ బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande