
మిర్యాలగూడ, 4 డిసెంబర్ (హి.స.)
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా
మిర్యాలగూడకు ధాన్యం తరలిస్తున్న 11 లారీలను మిర్యాలగూడ రూరల్ పోలీసులు మండలంలోని చెల్లేపల్లి టోల్గేట్ వద్ద గురువారం పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాలలో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి కొందరు దళారులు అక్రమంగా అనుమతులు లేకుండా తెలంగాణ ప్రాంతంలోని మిర్యాలగూడ రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 11 లారీలలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ధాన్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు