
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మైత్రి మైదానంలో పటాన్ చెరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రైవేట్ పాఠశాలల క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందిస్తే మానసిక వికాసం, శారీరక ధారుడ్యం లభిస్తుందని తెలిపారు. ర్యాంకుల మాయలో పడి క్రీడలను నిర్లక్ష్యం చేయవద్దని పాఠశాల యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు