
భద్రాద్రి కొత్తగూడెం, 4 డిసెంబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఇల్లందు మండలంలో స్థానిక సంస్థల
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు నామినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. బుధవారం కేవలం 9 సర్పంచ్ అభ్యర్థులకు మాత్రమే నామినేషన్లు రాగా గురువారం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు నామినేషన్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు