
జోగులాంబ గద్వాల, 4 డిసెంబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లోని అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని రైతులు గురువారం ధర్నా చేశారు. గత వారం రోజుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేసిన గన్ని సంచులు లేవని, రవాణా చేసేందుకు వాహనాలు లేవని రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వ్యవసాయం మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి ఆందోళన కొనసాగిస్తున్నారు.
మొక్కజొన్న పంటను కొనుగోలు చేసిన గన్ని బ్యాగులను వాహనాలలో తరలించే వరకు రైతు దే బాధ్యత అని వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు తెలపడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందుల బెడద, చలికాలం, తుపాను కారణంగా కొనుగోలు చేసిన పంటకు కావాలిగా ఉండలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి మొక్కజొన్న పంటను రోజు వారీగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు