
షాద్నగర్, 4 డిసెంబర్ (హి.స.)
ప్రతిపక్షాలను సైతం ఒప్పించి మెప్పించగల నేర్పరి రోశయ్య అని, రాజకీయాల్లో రోశయ్య నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆయన్ను ఆదర్శంగా తీసుకుని నేటి నాయకులు పని చేయాల్సిన అవసరం ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా గురువారం పట్టణ ఆర్యవైశ్య సంఘం, మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో రోశయ్య చిత్రపటానికి, విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు