శ్రీసుబ్రామణ్యేశ్వర స్వామి వారికి ఆర్వీ ఆర్ గ్రూప్.చైర్మన్ కోటి కి పైగా విలువ చేసే వండి మండపం
అమరావతి, 4 డిసెంబర్ (హి.స.) మోపిదేవి: కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆర్వీఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రావి వీర రాఘవ చౌదరి, సౌభాగ్యలక్ష్మి దంపతులు రూ.కోటికి పైగా విలువైన వెండి మండపాన్ని బహూకరించారు. రూ.1,01,53,742 విలువైన ఈ
శ్రీసుబ్రామణ్యేశ్వర స్వామి వారికి ఆర్వీ ఆర్ గ్రూప్.చైర్మన్ కోటి కి పైగా విలువ చేసే వండి మండపం


అమరావతి, 4 డిసెంబర్ (హి.స.)

మోపిదేవి: కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆర్వీఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రావి వీర రాఘవ చౌదరి, సౌభాగ్యలక్ష్మి దంపతులు రూ.కోటికి పైగా విలువైన వెండి మండపాన్ని బహూకరించారు. రూ.1,01,53,742 విలువైన ఈ వెండి మండపానికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభి సమక్షంలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామవర ప్రసాదరావుకు అందజేశారు. ఈ వెండి మండపాన్ని స్వామివారి గర్భాలయంలో ఉంచారు. దేవస్థానానికి రూ.కోటికి పైగా విలువ చేసే బహూకరణ రావడం ఇదే మొదటిసారి అని డిప్యూటీ కమిషనర్‌ చెప్పారు. రావి వీర రాఘవ చౌదరి దంపతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande