
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
భారత ఎన్నికల సంఘం చేపట్టిన
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిపై పనిభారం అధికంగా ఉందని టీవీకే పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. వారి వాదనలను విన్న తర్వాత.. ఎన్నికల విధులు నిర్వర్తించే బూత్ లెవెల్ ఆఫీసర్స్ (BLOs) ఎదుర్కొంటున్న అధిక పని ఒత్తిడిని, వ్యక్తిగత ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.
ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో భాగంగా పనిచేస్తున్న BLOల పని గంటలను తగ్గించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..