
సూర్యాపేట, 4 డిసెంబర్ (హి.స.)
ఎన్నికల నియమావళి దాటితే వేటే
పడుతుందని సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్ పోటీ అభ్యర్థులను హెచ్చరించారు. ఒక్కో సమయంలో చిన్న పొరపాట్లతో చివరికి అభ్యర్థిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఘాటుగా స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో ఎన్నికల నియామావళి,ప్రవర్తనపై పోటీ అభ్యర్థులకు గురువారం జరిగిన సమావేశంలో అవగాహన కల్పిస్తూ మాట్లాడారు.ఎన్నికల కోడ్ అమలయ్యే నాటినుండి అది ముగిసే వరకు కూడా అభ్యర్థులు చేపట్టే కార్యక్రమాలకు అనుమతులు పొందాల్సి ఉంటుందని వివరించారు.ఈనెల 9 సాయంత్రం నాలుగు గంటల లోపు ప్రచారం పూర్తి చేయాలని, ఈ క్రమంలో అభ్యర్థులు తీసుకున్న అనుమతులు కూడా రద్దవుతాయని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు