
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో డిసెంబర్ 14న జరగనున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ నెల 14న నిర్ణీత సమయానికి పరీక్ష జరుగుతుందనే విషయం స్పష్టమైంది. అయితే, అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టు (లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే వారి పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. పరీక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం, పిటిషనర్ల సమస్యను మాత్రం పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB)కు ఆదేశించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..