
అమరావతి, 4 డిసెంబర్ (హి.స.)
అన్నమయ్య జిల్లా :జిల్లాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొనఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కలికిరి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కలికిరి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తుండగా.. స్టేషన్ సిబ్బంది వారించారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు కాసేపు స్టేషన్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలోనే పట్టాలపై కూర్చొని మద్యం సేవించారు. అదే సమయంలో ఎక్స్ ప్రెస్ రైలు() వచ్చి.. వారిద్దరిని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదం)లో మద్యం సేవిస్తున్న ఇద్దరూ మృతి చెందారు. మృతుల్లో ఒకరు చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికి పెంటకు చెందిన గంధం ముని కుమార్ గా గుర్తించారు. మరొకరు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం లోని కలికిరి క్రాస్ రోడ్డుకు చెందిన జి వీరభద్రయ్య బాబుగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ