యువత మత్తు వదిలి మైదానాలకు చేరుకోవాలి. ఎమ్మెల్యే నాగరాజు
వరంగల్, 4 డిసెంబర్ (హి.స.) యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పక్కన ఉన్న ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే సందర
ఎమ్మెల్యే నాగరాజు


వరంగల్, 4 డిసెంబర్ (హి.స.)

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పక్కన ఉన్న ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఎమ్మెల్యే క్రీడారంగ బలోపేతంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు. ఇండోర్ స్టేడియంలో మరిన్ని వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల హనుమకొండలోని జెఎన్ఎస్ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించామన్నారు. విద్యార్థులు, యువత మత్తును వదిలి మైదానాలకు చేరుకోవాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande