రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది: మాజీ సీఎం జగన్
తాడేపల్లి, 4 డిసెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో రైతులు సంతోషంగా లేరని మాజీ సీఎం జగన్ (Former CM Jagan) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాడేపల్లి లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంల
జగన్


తాడేపల్లి, 4 డిసెంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో రైతులు సంతోషంగా లేరని మాజీ సీఎం జగన్ (Former CM Jagan) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాడేపల్లి లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని, రైతు పరిస్థితి చూస్తే సీమకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు.ఏ ప్రభుత్వమైనా రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు.

సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పండగాలా ఉండాల్సిన వ్యవసాయం.. చంద్రబాబు హయాంలో దండగగా మారిందని జగన్ విమర్శించారు. తన హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కు లభించిందని, కేవలం 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా 84 లక్షల మంది రైతులలో 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా అందిందని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రైతు జీవితాలు భిన్నమవయ్యాయని, బాబు పాలనలో పెండింగ్‌లో ఉన్న రూ.1100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బాకాయిలను తమ హయాంలో చెల్లించామని, ఉచిత పంటల బీమా కోసం తమ హయాంలో రూ.7800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

అలాగే కూటమి ప్రభుత్వ పాలనలో కలుషిత నీరు, ఆహారం తీసుకొని ప్రాణాలు కోల్పుతున్నవారి సంఖ్య పెరిగిందని, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లు, హాస్టల్‌లో ఫుడ్ ఫాయిజన్ వల్ల వందల మంది విద్యార్థుల ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో ఏ మాత్రం భోజనం బాగోలేదని మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande