భవానీపురంలో హైటెన్షన్.. 'హైడ్రా' తరహా కూల్చివేతలు
విజయవాడ, 4 డిసెంబర్ (హి.స.) ఏపీలోని విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేతపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు ఎకరాల 40 సెంట్ల వివాదాస్పద స్థలంలో లక్ష్మీ రామ కో ఆపరేటివ్ సోసైటికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అధికారులు ఇళ్లను తొలగిస్తున్నారు. 25 ఏళ్ల
/high-tension-hydra-style-demolitions-in-bhawanipuram-500466


విజయవాడ, 4 డిసెంబర్ (హి.స.)

ఏపీలోని విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేతపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు ఎకరాల 40 సెంట్ల వివాదాస్పద స్థలంలో లక్ష్మీ రామ కో ఆపరేటివ్ సోసైటికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అధికారులు ఇళ్లను తొలగిస్తున్నారు. 25 ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను కూల్చి వేయవద్దని ఫ్లాట్ల యజమానులు ఆందోళన చేస్తూ రోడ్ల పై బైఠాయించారు. ఈ క్రమంలోనే భవానీపురం కూల్చివేతలపై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 31 వరకు కూల్చివేతలపై స్టే విధించినట్లు సమాచారం. ఈ క్రమంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా.. పోలీసులు పట్టించుకోకుండా కూల్చివేతలు కొనసాగించారని బాధితులు మండిపడుతున్నారు. ఈ తరుణంలో సమస్యను సీఎం చంద్రబాబుకు వివరిస్తామని బాధితులు చెబుతున్నారు. నిన్న భవానీపురంలోని జోజిపేటలో 42 ఇళ్లు కూల్చివేసినట్లు సమాచారం. ఈరోజు బాధితులను స్థానిక ఎస్సై కలవనున్నారు. సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఎస్సై కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande