దత్త జయంతి పర్వదినాన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం లోని శ్రీ పాద శ్రీవల్లభ మహాసంస్థాపనానికి భారీ విరాళం
పిఠాపురం,, 5 డిసెంబర్ (హి.స.) దత్త జయం తి పర్వదినాన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానానికి భారీ విరాళం అందింది. బెంగళూరుకు చెందిన చక్కా వెంకట రాజేశ్వర్‌ పిఠాపురం మహారాజా కోట ప్రాంతంలో 940 చదరపు గజాల విస్తీర్ణంలో భవంతి
దత్త జయంతి పర్వదినాన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం లోని శ్రీ పాద శ్రీవల్లభ మహాసంస్థాపనానికి భారీ విరాళం


పిఠాపురం,, 5 డిసెంబర్ (హి.స.)

దత్త జయం తి పర్వదినాన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానానికి భారీ విరాళం అందింది. బెంగళూరుకు చెందిన చక్కా వెంకట రాజేశ్వర్‌ పిఠాపురం మహారాజా కోట ప్రాంతంలో 940 చదరపు గజాల విస్తీర్ణంలో భవంతి నిర్మించారు. రూ.2 కోట్లు విలువ చేసే ఈ ఆస్తిని శ్రీపాదశ్రీవల్లభులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అంగీకార పత్రాలను దత్త జయంతి రోజైన గురువారం మహా సంస్థానం ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధి inకారి ఆర్‌.సౌజన్యకు అందజేశారు. దాతను ఈవో ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదాలు అందజేయగా వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande