
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)
ఏపీ మంత్రి చొరవతో అయ్యప్ప భక్తులకు ఊరట లభించింది. శబరిమల వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వేచి చూస్తున్న అయ్యప్ప భక్తులకు మంత్రి సహాయం ఎంతో తోడ్పడింది. ఇండిగో విమాన సేవలు రెండు రోజులుగా రద్దవుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయంలో వేచి ఉన్నారు. గంటల పాటు వేచి ఉన్నప్పటికీ వారికి తాము వెళ్లాల్సిన ఫ్లైట్ గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అంతేకాకుండా ఆకస్మికంగా ఫ్లైట్ రద్దు చేసినట్లు సదరు విమానయాన సంస్థ ప్రకటించింది. దీంతో అయ్యప్ప భక్తులు నిరాశకు గురయ్యారు. స్వామికి ఇరుముడి సమర్పిద్దామని బయలుదేరిన తమకు ఎంతటి కష్టమొచ్చిందని వారు బాధపడ్డారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టుట్ లో విజయవాడ ఫ్లైట్ గురించి ఏపీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వేచి ఉన్నారు. తన ఫ్లైట్ ఆలస్యం కావడంతో అక్కడే ఉన్నారు.
శబరిమల వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ కాన్సిల్ అవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన చేయడం మంత్రి గమనించారు. విపరీతమైన ఆలస్యం అయితే దర్శనం టోకెన్లు పనికి రావని, దర్శనం చేసుకోలేమని వారు ఆందోళన వ్యక్తం చేయడంతో చలించిపోయారు. అక్కడ ఇండిగో సిబ్బంది స్పందించక పోవడం గమనించారు. స్వయంగా రంగంలోకి దిగి కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఫోన్ లో మాట్లాడారు. అక్కడే దగ్గర ఉండి వారికి ప్రత్యేక సదుపాయం కల్పించి శబరిమల విమానం బయలుదేరి వెళ్ళేదాకా పర్యవేక్షించారు.
సమావేశానికి బయలు దేరారు. తమ కోసం తెల్లవారుజాము నుంచి శ్రమ పడి ప్రయాణ వసతి కల్పించారని, ఆయన వల్లే సకాలంలో దర్శన భాగ్యం కలిగే అవకాశం పొందామని స్వాములు మంత్రి ధన్యవాదాలను తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు