రూ.4 కోట్లకు పైగా హవాలా డబ్బును పట్టుకున్న బోయినపల్లి పోలీసులు
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.) బోయినపల్లి పోలీసులు శుక్రవారం పెద్ద ఎత్తున హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది నెలల క్రితం కొంతమంది హవాలా డబ్బులు సరఫరా చేసే ముగ్గురు వ్యక్తులను బోయినపల్లి పోలీసులు పట్టుకుని వారిపై పక్కా నిఘా పెట్టారు. పోలీసు
బోయినపల్లి పోలీస్


హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)

బోయినపల్లి పోలీసులు శుక్రవారం పెద్ద ఎత్తున హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది నెలల క్రితం కొంతమంది హవాలా డబ్బులు సరఫరా చేసే ముగ్గురు వ్యక్తులను బోయినపల్లి పోలీసులు పట్టుకుని వారిపై పక్కా నిఘా పెట్టారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ముంబై, గుజరాత్ ల నుంచి హవాలా డబ్బు కోట్ల రూపాయలు వస్తున్నాయనే సమాచారం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాపు కాసి ఉన్నారు.

కాగా హవాలా డబ్బు తరలిస్తున్న నిందితుల వాహనాలను పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు.అనంతరం వారిని బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 4కోట్ల 5 లక్షల డబ్బుల సంచులు లభించగా, ఇద్దరు నిందితులను, కారు ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande