తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 8 వ తేదీ.వరకు వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల విడుదల
తిరుమల, 5 డిసెంబర్ (హి.స.) :తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నారు. తొలి మూడు రోజులకు ఈ-డిప్‌ ద్వారా ఇప్పటికే కే
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 8 వ తేదీ.వరకు వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల విడుదల


తిరుమల, 5 డిసెంబర్ (హి.స.)

:తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నారు. తొలి మూడు రోజులకు ఈ-డిప్‌ ద్వారా ఇప్పటికే కేటాయించారు. మిగిలిన ఏడు రోజులకు నేటి ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తారు. మఽధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande