
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వాయిస్ ఛాన్స్లర్ గా డా.రమేశ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రమేశ్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా పని చేస్తున్నారు. గతంలో ఈయన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) గా పని చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ పోస్టులో ఇదివరకు డాక్టర్ నందకుమార్రెడ్డి పని చేశారు. అయితే నందకూమార్ రెడ్డి వీసీగా చేరినప్పటి నుంచి హెల్త్ వర్సిటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు