విశాఖ నగరం ఎం ఎస్ ఏ డీ కూడలిలో భారీ యంత్ర పరికరాలు ట్రాలర్ నుచి. రహదారి పై..పడ్డాయి
విశాఖపట్నం 5 డిసెంబర్ (హి.స.) : విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ కూడలిలో గురువారం అర్ధరాత్రి 1.45 గంటలకు ఊహించని విధంగా భారీ యంత్ర పరికరాలు ట్రాలర్‌పైనుంచి రహదారిపై పడ్డాయి. అక్కయ్యపాలెం వైపు నుంచి గాజువాక వైపు వెళుతున్న సమయంలో పైవంతెనపై మలుపు తిరుగుతుండగా ఒ
విశాఖ నగరం ఎం ఎస్ ఏ డీ కూడలిలో భారీ యంత్ర పరికరాలు  ట్రాలర్ నుచి. రహదారి పై..పడ్డాయి


విశాఖపట్నం 5 డిసెంబర్ (హి.స.) : విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ కూడలిలో గురువారం అర్ధరాత్రి 1.45 గంటలకు ఊహించని విధంగా భారీ యంత్ర పరికరాలు ట్రాలర్‌పైనుంచి రహదారిపై పడ్డాయి. అక్కయ్యపాలెం వైపు నుంచి గాజువాక వైపు వెళుతున్న సమయంలో పైవంతెనపై మలుపు తిరుగుతుండగా ఒక్కసారిగా పరికరాలు జారిపోయాయి. దీంతో కొద్ది దూరం వరకూ ఒక్కొక్కటిగా అవి పడిపోయాయి. ఆ సమయంలో ట్రాలర్‌ వెనుక వాహనాలు ఏవీ రాకపోవడంతో భారీ ప్రమాదమే తప్పింది. ఈ ఘటనతో వంతెన కొంత దెబ్బతింది. పోలీసులు వచ్చే వరకూ వాహన చోదకులే మలుపులో ఉండి అటుగా ఇతర వాహనాలు రాకుండా సూచనలు ఇచ్చారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో జరిగిన ఘటన తీరు చూసిన చోదకులు అమ్మో అంటూ హడలిపోయారు. పరికరాలను పకడ్బందీగా కట్టకపోవడంతోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, ట్రాలర్‌ ప్రతినిధులు క్రేన్‌ రప్పించి యంత్రాలను వాహనంపైకి చేర్చారు. 3 గంటలకు పరిస్థితి చక్కదిద్దారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande