
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)
మంత్రి పొంగులేటి కుటుంబానికి
చెందిన రాఘవ కనస్ట్రక్షన్ సహా పలువురి పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన భూములపై జేసీబీలు తీసుకువెళ్ళి కూల్చడంతో కేసు నమోదైంది. సాక్ష్యాధారాలతో బాధితుల ఫిర్యాదు చేయడంతో దాడి, దౌర్జన్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసుపై మంత్రి పొంగులేటి స్పందించారు.
అధికారులతో సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. తాను అయినా, తన కొడుకు అయినా తప్పు చేస్తే శిక్షకు అర్హులమేనని అన్నారు. ప్రతిపక్షాల వాళ్లు కేసులు పెట్టించారని చెప్పుకోవడమనేది తప్పని చెప్పారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన కొడుకు మీద కేసు రిజిస్టర్ చేయొద్దని అనొచ్చు.. కానీ ఆ ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదన్నారు. కేసు రిజిస్టర్ అయిన తరవాత నిజ నిర్థారణ జరిగితే శిక్షిస్తారని అన్నారు. కానీ తప్పు జరగకపోతే రాసిన వాళ్లు ఏం చేస్తారో వాళ్ల ఇంగితజ్ఞానానికే వదిలేస్తున్నానని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..