ఇండిగో విమానాల రద్దు ఎఫెక్ట్... ఆన్ లైన్ ద్వారా తమ రిసెప్షన్లో పాల్గొన్న జంట
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.) ఇండిగో విమాన సర్వీసుల్లో రెండు మూడు రోజులుగా అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా దాపు విమానాలు రద్దయ్యాయి. ఇక విమానాల రద్దు ప్రభావం ఓ జంట రిసెప్షన్ పై సై
ఆన్లైన్ రిసెప్షన్


హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)

ఇండిగో విమాన సర్వీసుల్లో రెండు మూడు రోజులుగా అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా దాపు విమానాలు రద్దయ్యాయి. ఇక విమానాల రద్దు ప్రభావం ఓ జంట రిసెప్షన్ పై సైతం పడింది. బెంగుళూరులో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మేధా క్షీరసాగర్, సంగమ దాస్ నవంబర్ 23న భువనేష్వర్ లో వివాహం చేసుకున్నారు.

పెళ్లి కుమార్తె మేధాది కర్నాటకలోని హుబ్బల్లి కాగా వధువు స్వగ్రామంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 2న భువనేశ్వర్ నుండి బెంగుళూరుకు టికెట్ సైతం బుక్ చేసుకున్నారు. బుధవారం ఉదయం 9గంటలకు విమానం రావాల్సి ఉండగా గంటల పాటు విమానాశ్రయంలో వేచిచూసి విసిగిపోయారు. చివరికి విమానం రద్దు అయ్యిందని తెలియడంతో హుబ్బల్లిలో జరిగిన తమ రిసెప్షన్ కు వీడియో కాల్ ద్వారా హాజరయ్యారు. బంధువులు అంతా ఫంక్షన్ హాల్ లో ఉంటే వధూవరులు ఎల్ ఈ డీ స్క్రీన్ పై ప్రత్యక్షం అయ్యారు. ఫంక్షన్ కు వచ్చిన బంధువులను కలవలేకపోయామని ఎంతగానో బాధపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande