
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 395 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు గ్రామాలకు ఒక్క నామినేషన్దాఖలు కాలేదు. ఈ నెల 11న జరగనున్న మొదటి విడత ఎన్నికల్లో 4,236 గ్రామాలకు గాను 3,836 గ్రామ సర్పంచ్లకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్లకు నామినేషన్లు వేసిన వారిలో 8,095 మంది తమ నామినేషన్లను ఉపసంహరించున్నారు. 9,626 మంది అభ్యర్థులు వార్డులకు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 37,440 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్విడుదల చేయగా 149 వార్డులకు ఒక్కరు కూడా నామినేషన్దాఖలు చేయలేదు. 9,331 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడతకు సంబంధించిన వివరాలను గురువారం ఎన్నికల సంఘం వెల్లడించింది. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు