ఇండిగో విమానం ఆలస్యం.. శంషాబాద్ ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళన
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.) శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయ్యప్ప స్వాములు మెరుపు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం ఏకంగా 12 గంటలు ఆలస్యమైంది. అయితే, నిన్న సాయంత్రం కొచ్చి విమానం ఇప్పటికీ బయలుదే
శంషాబాద్ ఎయిర్పోర్టులో


హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయ్యప్ప స్వాములు మెరుపు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం ఏకంగా 12 గంటలు ఆలస్యమైంది. అయితే, నిన్న సాయంత్రం కొచ్చి విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంపై అయ్యప్ప స్వాములు ఇండిగో ఫ్లైట్ సిబ్బందిని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానం చెప్పగా.. తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తామంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని.. చివరి నిమిషంలో విమానం బయలుదేరకపోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేట్కు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతుండగా.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande