సత్యవర్ధన్ అపహరణ దాడి కేసులో వల్లభనేని. వంశీ అనుచరుడైన యర్రంశెట్టి రామాంజనేయులు ను పోలీసువర్రేస్ట్ చేశారు
అమరావతి: సత్యవర్ధన్‌ అపహరణ, దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరుడైన యర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్‌ రాము అలియాస్‌ పొట్టి రాము (ఏ9)ను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని ఆయన ఇంట్లో ఉండగా గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్
సత్యవర్ధన్ అపహరణ దాడి కేసులో వల్లభనేని. వంశీ అనుచరుడైన యర్రంశెట్టి రామాంజనేయులు ను పోలీసువర్రేస్ట్ చేశారు


అమరావతి: సత్యవర్ధన్‌ అపహరణ, దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరుడైన యర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్‌ రాము అలియాస్‌ పొట్టి రాము (ఏ9)ను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని ఆయన ఇంట్లో ఉండగా గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. గత పది నెలలుగా నిందితుడు పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇటీవల విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. విచారణ అనంతరం నిందితుడిని శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో న్యాయాధికారి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది.

కిడ్నాప్‌లో కీలకపాత్ర.... తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ను బెదిరించి కేసును ఉపసంహరించుకునేలా చేయడంలో రామాంజనేయులు కీలకపాత్ర పోషించాడు. సత్యవర్ధన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో హనుమాన్‌ జంక్షన్‌ తీసుకెళ్లి బెదిరించాడు. వాంగ్మూల పత్రాలపై సంతకాలు తీసుకున్నాడు. మరుసటి రోజు బాధితుడిని విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లి.. ఈ కేసుకు తనకు సంబంధం లేదనీ, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని అతనితో న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇప్పించాడు. వాంగ్మూలం ఇచ్చిన అనంతరం.. ఫిబ్రవరి 10న సత్యవర్ధన్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి.. మై హోమ్‌ బుజాలో వంశీని కలిపించారు. ఆ రాత్రి అక్కడే ఉంచి బెదిరించారు. అనంతరం 11న ఏపీ 40 బీజీ 5005 నంబరు గల కారులో మిగిలిన నిందితులతో కలసి విశాఖపట్నం తీసుకెళ్లాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande