
భామిని, 5 డిసెంబర్ (హి.స.)
మన్యం జిల్లాలోని భామినిలో జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచీర్స్ మీటింగ్ 3.0 (PTM 3.0) ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భామిని చేరుకున్నారు.
అక్కడి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థుల మధ్యలో చేరారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ రాకతో విద్యార్థులు ఆనందానికి గురయ్యారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్ చిన్నారుల వద్దకు వెళ్లారు. వారి కాస్ల రూంలో బెంచ్ లపై కూర్చొని ముచ్చటించడం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతిలో ట్యాబ్ పట్టుకున్నారు. దానిని ఓ చిన్నారి వద్దకు తీసుకెళ్లారు. ఆ చిన్నారికి ఆ ట్యాబ్ ను చూపిస్తూ అందులో ఉన్న అంశాన్ని చదవాలని సూచించారు. చిన్నారి అందులోని అంశాన్ని చదివే ప్రయత్నం చేయగా ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి నారా లోకేష్ ఇదంతా ఆసక్తి చూస్తూ ఉన్నారు. తాను కూడా బడిలో తరగతి విద్యార్థిలా మారిపోయారు. తండ్రి పాఠాలు చెబుతుంటే బుద్ధి గల తనయుడిలా ఆసక్తిగా ఆలకించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్యా్బ్ ఎలా వినియోగించాలోనని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV