
అనంతపురం, 5 డిసెంబర్ (హి.స.)
అనంతపురంలోని జీజీహెచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఓ రైతు గురువారం ఆత్మహత్య చేసుకోగా.. అతని పార్థివ దన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం జీజీహెచ్ వద్దకు తరలించారు. ఈ క్రమంలో అతని మృత దేహాన్ని నేడు ఉదయం 10 గంటలకు తరలించనుండాల్సి ఉంది. అందుకు భిన్నంగా ముందుగానే మృత దేహాన్ని తరలించే ప్రయత్నం జరగడంతో మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురం జీజీహెచ్ వద్దకు చేరుకున్నారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు రైతు మృతదేహాన్ని తరలిస్తామని పోలీసులు చెప్పారన్నారు. కానీ అందుకు భిన్నంగా ఉదయం 8 గంటలకే రైతు మృతదేహాన్ని పోలీసులు తరలించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. హడావిగా పోస్టుమార్టం చేసి.. రైతు మృతదేహాన్ని హుటాహుటిన తరలించాల్సిన అవసరం ఏమి వచ్చిందని శైలజానాథ్ పోలీసులను ప్రశ్నించారు. అరటి రైతులు నష్టపోతున్నారని అన్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నా ఎటువంటి ఫలితం లేకుండా పోతోందన్నారు.
ఈ క్రమంలోనే శింగనమల నియోజకవర్గంలోని ఎల్లుట్ల గ్రామానికి చెందిన రైతు నాగలింగం (40) బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. బాధిత కుటుంబాన్ని తాము పరామర్శించేందుకు వస్తుంటే నిర్ణీత సమయానికి ముందే వారిని తరలించే ప్రయత్నం జరగడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV