
హుజురాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
ఎన్నికల హామీలు అమలు
చేయగలరా? అని అడిగితే ఈటల రాజేందర్ కు ఏం తెలియదు అన్నారు.. చివరకు నేను చెప్పిందే నిజమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కమలాపూర్ మండలం శంభునిపల్లి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మీరు నన్ను కోసిన నేనేమీ ఇవ్వలేను... మనల్ని చూస్తే దొంగ లాగానే చూస్తున్నారు.. అంతలా దివాలా తీసింది రాష్ట్రం అని సీఎం వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఎన్నికల ముందు హామీ ఇస్తున్నప్పుడు.. మీరు నాలుగేళ్లు అసెంబ్లీలో కొట్లాడారు, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని చెప్పారు ఇన్ని హామీలు అమలు చేయగలరా అని అడిగితే ఈటల రాజేందర్ కు ఏం తెలియదు అన్నారని చెప్పుకొచ్చారు. సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టాలంటే తలప్రాణం తోకకు వస్తుందని, నేను స్వయంగా వెళ్లి నిలబడమన్నా కూడా ఉన్న కొంత మంది భూమి, పుస్తెలు కూడా అమ్ముకోమంటారా..? ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సర్పంచులు వీడియోలు తీసి పెడుతున్నారు.. మాలాంటి కష్టం మీకు రాకూడదని, అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి అని అన్నారు. అ
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు