
వరంగల్, 8 డిసెంబర్ (హి.స.)
హనుమకొండ పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు పరార్ అయ్యారు. ఇతర రాష్ట్రానికి చెందిన నలుగురు గంజాయి నిందితులను నార్కోటిక్స్ పోలీసులు పట్టుకొన్నారు. వారిని హనుమకొండ పోలీసులకు అప్పగించారు. వారు హనుమకొండ పోలీసు స్టేషన్ లాకప్లో ఉంచారు. పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం తెల్లవారుజామున 5గంటలకు సెంట్రీ డ్యూటీ పోలీసుల కళ్లు గప్పి కంప్యూటర్ రూమ్ వెనుక భాగం డోర్ పగలగొట్టి ముగ్గురు దొంగలు పరార్ అయ్యారు.
ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో పారిపోయిన దొంగలను పట్టుకోవడానికి హనుమకొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి కేసులో అరెస్టు అయిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారి సెల్ఫోన్ కాల్స్పై నిఘా పెట్టారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు