రామయ్యకు ఇంకా వనవాసం తప్పట్లేదు.. భద్రాద్రిని కాపాడుకుందాం: మాధవి లత
భద్రాచలం, 7 డిసెంబర్ (హి.స.) భద్రాద్రి రామయ్యను రాజకీయ ఇంకా చక్రబంధం నుండి బయటకు తీసుకు వద్దామని, బి ఆర్ ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు భద్రాద్రి దివ్యక్షేత్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని, దీంతో రామయ్యకు వనవాసం తప్పలేదు అనిపిస్తుందని బీజేపీ స్పోక్స్
మాధవి లత


భద్రాచలం, 7 డిసెంబర్ (హి.స.)

భద్రాద్రి రామయ్యను రాజకీయ

ఇంకా చక్రబంధం నుండి బయటకు తీసుకు వద్దామని, బి ఆర్ ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు భద్రాద్రి దివ్యక్షేత్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని, దీంతో రామయ్యకు వనవాసం తప్పలేదు అనిపిస్తుందని బీజేపీ స్పోక్స్ పర్సన్ మాధవి లత ఆరోపించారు. ఆదివారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సర్పంచ్ అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ... ఆమె భద్రాచలం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పాకిస్తాన్, ముస్లిం జపం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ 10 సంవత్సరాల పదవీ కాలంలో ఒక్క సారి మాత్రమే సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు తెచ్చారని, రామాలయ అభివృద్ధికి ప్రకటించిన రూ.100 కోట్లలో ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019-20 లో గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.1028 కోట్లు మంజూరు చేస్తే... కేసీఆర్ ప్రభుత్వం కేవలం 5.612 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని దుయ్యబట్టారు.

ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తే... 10 సంవత్సరాలుగా కనీసం స్థలం చూపలేదని ఎద్దేవా చేశారు. భద్రాద్రి వాసులు కేవలం 8 కిలోమీటర్లు పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైన్ కావాలని కోరితే... ప్రధాని మోదీ రూ.3592 కోట్లు ఖర్చుపెట్టి ఒడిస్సా మల్కన్ గిరి నుండి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు 173 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని నిర్మిస్తుందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande