రైస్ మిల్ పై సివిల్ సప్లై అధికారుల దాడి.. 600 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కరీంనగర్, 7 డిసెంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 600 క్వింటాళ్లపైన రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచ
సివిల్ సప్లై


కరీంనగర్, 7 డిసెంబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 600 క్వింటాళ్లపైన రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఆదివారం అధికారులు మెరుపు దాడి చేసి రెండు ఆటో లను సీజ్ చేశారు.

అలాగే మిల్లు యజమానిపై 6-ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన బియ్యాన్ని సివిల్ సప్లై డీఎం కు అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande