
అమరావతి, 7 డిసెంబర్ (హి.స.)
ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఈఓ మురళీకృష్ణ.. ఆలయంలోని అమ్మవారికి సంబంధించిన 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులు చాకచక్యంగా తస్కరించి చేతివాటం ప్రదర్శించాడు. ఎవరూ లేరనుకుని దోచుకున్న సామాగ్రితో తప్పించుకునేందుకు సిద్ధమయ్యాడు. గమనించిన భక్తులు, స్థానికులు.. అడ్డంగా అతణ్ని పట్టుకున్నారు. అనంతరం.. పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన మురళీకృష్ణ సహా అతడి కుటుంబ సభ్యులను ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అమ్మవారి ఆభరణాలను తస్కరించేందుకు ప్రయత్నించిన ఈఓపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ