
ఎలమంచిలి, 7 డిసెంబర్ (హి.స.)
రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. రూ. 10 కోట్లతో రైల్వేస్టేషన్‌లో రెండేళ్ల కిందట అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఏడాదిన్నర పాటు సాగిన పనులు మధ్యలో నిలిపివేశారు. దీంతో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం ప్రమాదకరంగా మారి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఇటీవల రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్‌ను పరిశీలించి నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో పనులు ముమ్మరమయ్యాయి. కాలిబాట పైవంతెన దాదాపు 80 శాతం పూర్తి చేశారు. ప్రయాణికుల విశ్రాంతి భవనం, తాగునీటి వసతి, ప్లాట్‌ఫాంల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ప్లాట్‌ఫాం పొడవునా షెడ్లు వేసే పనులు ఊపందుకున్నాయి. రెండో నంబరు ప్లాట్‌ఫాంపై గోతులు తవ్వి వదిలేయడంతో వీటిలో పడి ప్రయాణికులు గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా వీటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఒకటి, రెండు ప్లాట్‌ఫాంల మధ్యలో ఉన్న ఫుట్‌పాత్ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తగా మరొకటి నిర్మిస్తున్నారు. పాత వంతెన వినియోగించడానికి ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగా చేపట్టిన వంతెనను పూర్తి చేయడానికి చర్యలు ముమ్మరం చేశారు. ముందుగా ఈ రెండు ప్లాట్‌ఫాం పనులను పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన తరవాత మూడో నంబరు ప్లాట్‌ఫాం పనులు చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ