40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
ఖమ్మం, 7 డిసెంబర్ (హి.స.) ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని పాత మిట్టపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి సత్యనారాయణ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సుమారు రూ.1,36,600 విలువగల
రేషన్ బియ్యం


ఖమ్మం, 7 డిసెంబర్ (హి.స.)

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని పాత మిట్టపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి సత్యనారాయణ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సుమారు రూ.1,36,600 విలువగల బియ్యాన్ని నిల్వ ఉంచారని తెలుసుకొని దాడి చేసి మీర్జా గిలానీ బేగ్ను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు ముసారప్ పరారీలో ఉన్నట్టు ఏసీపీ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande