మేడారంలో కిక్కిరిసిన భక్తజనం.. బారులు తీరిన వాహనాలు
ములుగు, 7 డిసెంబర్ (హి.స.) మేడారం మహా జాతరకు మరో నెల 15 రోజుల సమయం ఉండగానే ముందస్తు మొక్కులు తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం చ
మేడారం


ములుగు, 7 డిసెంబర్ (హి.స.)

మేడారం మహా జాతరకు మరో నెల 15 రోజుల సమయం ఉండగానే ముందస్తు మొక్కులు తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారు గద్దెల ప్రాంతానికి చేరుకొని తల్లులకు సారా చీరే పసుపు కుంకుమలు సమర్పించి ముక్కులు చెల్లించుకుంటున్నారు. వందలాది ప్రైవేటు వాహనాలు మేడారంలో బారులు తీరాయి. ఒకవైపు గద్దెల ప్రాంతంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతుండగానే మరోవైపు భక్తులు గద్దెల ప్రాంతానికి చేరుకొని మొక్కులు చెల్లించుకోవడం సందడిగా మారింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande