
మహబూబాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
ఏజెన్సీ మండలంలో గుడుంబా
వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు దృఢంగా చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు కొత్తగూడ మండలంలో పోలీసులు అక్రమ గుడుంబా స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదివారం కొత్తగూడ మండలంలోని గుంజేడు గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్యాలగడ్డ గ్రామంలో పోలీసులు భారీ దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో పెద్దమొత్తంలో గుడుంబా, తయారీ పరికరాలు, డ్రములు, కాస్టిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు మాట్లాడుతూ ..గుడుంబా తయారు చేసినా, అమ్మినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం. గుడుంబా వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు