
తమిళనాడు, 7 డిసెంబర్ (హి.స.) తమిళనాడులో దారుణం చోటు
చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాల్పారైలోని అయ్యర్పాడి తేయాకు ఎస్టేట్ లో అస్సాం వలస కార్మికుడి కుటుంబం పనిచేస్తోంది. కాగా ఆ కుంటుంబంలోని బాలుడు సైఫుల్ శనివారం ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలో తేయాకు పొదల్లోనుండి వచ్చి ఒక్కసారిగా దాడి చేసింది.
బాలుడిని అక్కడ నుండి లాక్కెళ్లిపోయింది. బాలుడు ఇంటి ముందు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, తోటలో పనిచేసే కార్మికులు గాలింపు మొదలు పెట్టగా ఒకదగ్గర మృతదేహాన్ని గుర్తించారు. బాలుడి ఒంటిపై ఉన్నగాయాలు, చిరుత ఆనవాళ్లు ఉన్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..