ఇందిరా పార్కు వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వంచన పాలనపై బీజేపీ మహా ధర్నా
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వంచన పాలనను, పెండింగ్లో ఉన్న హామీల అమలును నిరసిస్తూ బీజేపీ నేతలు ఇందిరా పార్కు వద్దకు చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని పాలనపై నిరసన వ్యక్తం చేశా
బిజెపి మహా ధర్నా


హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)

తెలంగాణలో అధికారంలో ఉన్న

కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వంచన పాలనను, పెండింగ్లో ఉన్న హామీల అమలును నిరసిస్తూ బీజేపీ నేతలు ఇందిరా పార్కు వద్దకు చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని పాలనపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని, కుటుంబ పాలన చేసిన బీఆర్ఎస్, నియంత పాలనతో అక్రమాలు, అవినీతి చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనేక హామిలిచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినప్పటికీ హామీలు నెరవేర్చలేదని, ఏ ముఖం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande