ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి..
ఆదిలాబాద్, 8 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో రోజురోజుకు చలి (Cold Wave) పెరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్టంగా కుమ్రం భీం జిల్లా గిన్నెదరిలో 6.6 డిగ్రీలు నమోదయింది. ఆదిలాబాద్లో జిల్లా అర్లీ టీలో
ఆదిలాబాద్ చలి


ఆదిలాబాద్, 8 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో రోజురోజుకు చలి (Cold

Wave) పెరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్టంగా కుమ్రం భీం జిల్లా గిన్నెదరిలో 6.6 డిగ్రీలు నమోదయింది. ఆదిలాబాద్లో జిల్లా అర్లీ టీలో 6.8గా రికార్డయింది. నిర్మల్ జిల్లా పెంబిలో 9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి 6.6 డిగ్రీలు, వికారాబాద్లో 7.8 డిగ్రీలు, కామారెడ్డిలో 8.2, నిజామాబాద్ 8.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

హైదరాబాద్లో అతి తక్కువగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్ 10.1 డిగ్రీలు, అల్వాల్, బీహెచ్ఎల్లో 10.6, ఆర్సీపురంలో 12.2, నేరేడ్మెట్ 12.4, చందానగర్లో 12.4 డిగ్రీలు నమోదయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande